లేడీ సూపర్ న‌చ్చ‌దు కానీ, న‌య‌న్ అంటే ఇష్ట‌మేన‌ట‌.. మాళ‌విక భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, యంగ్ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి కోల్డ్ వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఓ సినిమాలోని హ‌స్ప‌ట‌ల్ సీన్ లో న‌య‌న్ మేక‌ప్ వేసుకుని అందంగా రెడీ అయిందంటూ మాళ‌విక వెట‌కారంగా మారింది. కొద్ది రోజుల త‌ర్వాత న‌య‌న్ ఆమెకు త‌న‌దైన శైలిలో దిమ్మ‌దిరిగిపోయే కౌంట‌ర్ అయింది.

అయితే తాజాగా న‌య‌న్ ను మాళ‌విక మ‌రోసారి ప‌రోక్షంగా టార్గెట్ చేసింది. `లేడీ సూప‌ర్ స్టార్ పై మీ అభిప్రాయం ఏంటి..?` అని ప్ర‌శ్నించ‌గా.. అస‌లు త‌న‌కు లేడీ సూప‌ర్ స్టార్ అని పిల‌వ‌డ‌మే న‌చ్చ‌దు అని మాట్లాడింది. ఈ విష‌యంలో న‌య‌న‌తార అభిమానులే కాదు ప‌లువురు నెటిజ‌న్లు సైతం మాళ‌వికపై విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో మాళ‌విక సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చింది.

`నేను ప్రత్యేకంగా ఏ నటి గురించీ చెప్పలేదు. ఫీమేల్ యాక్టర్స్ గురించి వర్ణించేటప్పుడు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదంపై మాత్రమే కామెంట్ చేశా. అంతే తప్ప.. నేను ఎవరినీ ఏమీ అనలేదు. నయనతార అంటే నాకు నిజంగా గౌరవం. చిత్రసీమలో ఆమె నాకంటే సీనియర్. హీరోయిన్ గా ఆమె ప్రయాణం అద్భుతమైనది. నేను ఆమెను ఆరాధిస్తాను. నయనతారకు నా ప్రేమను పంపిస్తున్నాను` అని మాళవికా ట్వీట్ చేసింది. మొత్తానికి కోల్డ్ వార్ కు ఒక్క ట్వీట్ తో మాళ‌విక పులిస్టాప్ వేసే ప్ర‌య‌త్నం చేసింది. మ‌రి ఇప్ప‌టికైనా ఈ గొడ‌వ ఇప్ప‌టితో ఆగుతుందా..లేదా.. అన్న‌ది చూడాలి.