అందం ఉండి ఏం లాభం అంటున్న ఫ్యాన్స్… మిల్కీబ్యూటీ పని అంతేనా?

మిల్కీబ్యూటీ తమన్నా గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయం, డాన్స్ కలబోసిన హీరోయిన్ తమన్నా. టాలెంట్ మాట ఎలాగున్నా, మొదట ఆమె అందం చూసే సినిమా ఆఫర్లు మన తెలుగులో అనేకం వచ్చాయి. అందులో ఓ మూడు నాలుగు మినహా ఆమెకి పేరు తెచ్చిన సినిమాలు పెద్దగా ఏవి లేవు. అయితే ఈమధ్య కాలంలో చూసుకుంటే ఆమెకి అడపా దడపా తప్ప పెద్దగా సినిమాలు ఛాన్సులు వచ్చిన దాఖలాలు లేవు. సీనియర్స్ హీరోలు మినహా కుర్ర హీరోలు ఆమెని పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలోనే ఆమెపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఎక్కడైనా హీరోయిన్లపై ట్రోలింగ్ చేయడం అనేది కొత్త కాదు. ప్రతి ఒక్క హీరోయిన్ కు ఏదో ఒక దశలో ట్రోలింగ్ కి గురవుతూ వుంటారు. అయితే దాన్ని ఎంత బాగా ఎదుర్కొంటే, హీరోయిన్లు అంత రాటుదేలుతారు. ఇలాంటి ట్రోలింగ్స్ తమన్నకు కూడా కొత్తేమి కాదు. ఆమె అందంపై మాత్రం ఇప్పటివరకు విమర్శలు వచ్చింది లేదుగాని, తొలిసారిగా తమన్న లుక్స్ పై ట్రోలింగ్ మొదలైంది.

తమన్నా భాటియా వయస్సు ఇప్పుడు 33 సంవత్సరాలు. అయితేనేం పెద్ద వయసేమి అయిపోయిందని ఆమెకి అనుకుంటున్నారా? విషయం అది కాదు గాని… ఇంత అందం పెట్టుకొని కూడా ఆమె సినిమా పరిశ్రమలో రాణించకపోవడం పట్ల ముఖ్యంగా ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. అవును, ఏ చిత్ర పరిశ్రమలో చూసుకున్నా…. ఆమెకున్న స్కిన్ టోన్ మరెవరికీ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. అయినా సినిమా ఆఫర్లు అందుకోవడంలో తమ్ము ఎందుకు తడబడుతుందో అని ఆమె అభిమానులు మానసికంగా కృంగిపోతున్నారు.