క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్`ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

`బింబిసార‌` వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్‌ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న చిత్రం `అమిగోస్`. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించినది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన అమిగోస్ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మ‌రోవైపు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ సినిమాపై మ‌రింత హైప్ పెంచుతున్నారు. నంద‌మూరి అభిమానులు ఈ మూవీతో క‌ళ్యాణ్ రామ్ కు మ‌రో హిట్ ఖాయ‌మ‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు.

ఇక‌పోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. అమిగోస్ మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ క‌ళ్యాణ్ రామ్ కాద‌ట‌. ఈ సినిమాని తొలిత టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో చేద్దాం అనుకున్నాడట డైరెక్టర్ రాజేందర్ రెడ్డి. కథ కూడా విజ‌య్ కు బాగా నచ్చింద‌ట‌. కానీ అప్పటికే ఆయన లైగర్ మూవీ కి రెండేళ్ల పాటు డేట్స్ మొత్తం కేటాయించడం తో ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చింద‌ట‌. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ ఈ మూవీని ఓకే చేశాడని తెలుస్తోంది. మ‌రి ఈ సినిమా క‌ళ్యాణ్ రామ్ కు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.