`అమిగోస్‌` 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్.. ఇంకా రాబ‌ట్టాల్సింది చాలా ఉంది!

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది.జిబ్రాన్ సంగీతం అందించాడు.

మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి డిసెంట్ టాక్ ల‌భించింది. అయితే స‌రైన బ‌జ్ లేక‌పోవ‌డం వ‌ల్ల కలెక్ష‌న్స్ విష‌యంలో ఈ మూవీ ఊహించిన రేంజ్ లో జోరు చూపించ‌లేక‌పోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 2.03 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రెండో రోజు రూ. 1.11 కోట్ల రేంజ్ లో షేర్ ను ద‌క్కించుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1.34 కోట్ల షేర్ ని రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా అమిగోస్ 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.09 కోట్లు
సీడెడ్: 44 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 37 ల‌క్ష‌లు
తూర్పు: 29 ల‌క్ష‌లు
పశ్చిమ: 17 ల‌క్ష‌లు
గుంటూరు: 41 ల‌క్ష‌లు
కృష్ణ: 23 ల‌క్ష‌లు
నెల్లూరు: 14 ల‌క్ష‌లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 3.14 కోట్లు(5.25 కోట్లు~ గ్రాస్‌)
————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 28 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ – 50 ల‌క్ష‌లు
————————————–
టోట‌ల్ క‌లెక్ష‌న్స్ = 3.92 కోట్లు(6.85 కోట్లు~ గ్రాస్)
————————————–

కాగా, రూ. 11.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే తొలి రెండు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 8.08 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఈ రేంజ్ లో షేర్ ను అందుకోవాలంటే క‌ళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకాస్త జోరును పెంచాల్సిందే.