రూ.5 కోట్ల పెట్టుబడితో కొన్ని కోట్ల లాభం తెచ్చిన లవ్ టుడే చిత్రం…!!

ఈమధ్య తమిళ్లో లవ్ టుడే పేరుతో వచ్చిన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రదీప్ రంగనాథ్ , ఇవానా జంటగా.. యోగి బాబు , సత్యరాజ్, రాధిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లవ్ టుడే .. హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.. సాధారణంగా సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తూ పెద్ద సినిమాలకు పోటీ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎటువంటి అంచనాలు లేకుండా ఎవరికి తెలియకుండా వచ్చిన ఆ చిన్న సినిమాలే భారీ హిట్స్ కొడతాయి అనడంలో సందేహం లేదు.. సినిమా పరిశ్రమలలో ఇలాంటి సందర్భాలు జరుగుతూనే ఉంటాయి ఈ క్రమంలోనే అలా తమిళ సినిమాగా వచ్చిన లవ్ టుడే ఇప్పుడు 100 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా విజయం సాధించింది..

Love Today: A blatant exercise in voyeurism | Entertainment News,The Indian  Express

రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకరకంగా చెప్పాలి అంటే రూ.5 కోట్లతో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో ప్రదీప్ రంగనాథన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఒకరి ఫోన్ ఒకరు మార్చుకొని వాడాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎమోషన్స్, కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా.. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే ప్రదీప్ ఇవానా స్టార్ సెలబ్రిటీలు అయిపోయారు.

Love Today Box Office Collection Day 9: Pradeep's film is a winner! -  JanBharat Times

అంతేకాదు ఈ కాన్సెప్ట్ అనేది ఇటీవల సామాన్య ప్రజలపై కూడా పడడంతో తమిళనాడులో ఒక ప్రేమ జంట తమ ఫోన్లను మార్చుకున్న విషయం కూడా తెలిసిందే. ఇలా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా 100 రోజులు ఈరోజుతో పూర్తి చేసుకుంది తమిళనాడులోని కొన్ని సెంటర్స్ లో ఇంకా ఆడుతూ ఉండడం విశేషం.. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రదీప్ కి అటు హీరోగా ఇటు దర్శకుడిగా కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ఏది ఏమైనా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు కొట్టి 100 రోజుల సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ఈ చిన్న సినిమా.