బిగ్ బాస్ ఇక అట్టకెక్కినట్టేనా..?

బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా 7 సీజన్ కి సంబంధించి అప్డేట్ అయితే రాలేదు కానీ పలు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటి లో మొదలుపెట్టారు. అయితే బిగ్ ఓటిటిలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయినట్లు సమాచారం.. కానీ ప్రసారం చేయక తప్పదు కాబట్టి బిగ్ బాస్ నాన్ స్టాప్ 70 రోజులు నడిపించారు. బిగ్ బాస్ మొదటినుంచి 5 సీజన్ ల వరకు చూసిన ప్రేక్షకులు 6వ సీజన్ ను ఘోరమైన రేటింగ్ను రావడం జరిగింది.

Buzz: Bigg Boss 7 Telugu to be streamed on this OTT platform | 123telugu.com
ఇక దీంతో బిగ్ బాస్ సీజన్ -7 కి ముందు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 ఉంటుందని అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ ఓటిటి దాదాపుగా అట్టకెక్కినట్టే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నీ ఆడియోస్ కేవలం టీవీలో చూసేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు తప్ప ఓటీటిలో పెద్దగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈసారి హోస్ట్ గా నాగార్జున కూడా రాలేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి కొంతమంది హీరోలను హోస్టుగా తీసుకువచ్చే పనీలో బిగ్ బాస్ షో నిర్వాహకులు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ -7 కి కూడా దారుణమైన కంటెస్టెంట్లను తీసుకు వచ్చినట్లు అయితే ఈ సీజన్ కూడా గత సీజన్ కంటే ఘోరంగా ఉంటుందని చెప్పవచ్చు.