బాలకృష్ణ హోస్టుగా చేస్తున్నటువంటి అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి సెకండ్ ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది .మొదటి పార్ట్ ఎప్పుడో మొదలైంది. ఈ ఎపిసోడ్ భారీగానే వ్యూస్ రాబట్టింది. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు పవన్ కళ్యాణ్. రెండోవైపు సార్లు కూడా రాజకీయపరమైన ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఇక పవన్ కళ్యాణ్ కారు పైకి ఎక్కి కూర్చున్న ఫోటోను చూపించి.. ప్రశ్నలు అడిగారు బాలయ్య. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరావచ్చు కదా అని కూడా అడిగారు. వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న మీ ఫ్యాన్స్ ఓటు ఎందుకు వేయలేదు అనే ప్రశ్న వేయడం జరిగింది. ఈ ప్రశ్నలన్నిటికీ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈ ఎపిసోడ్లో డైరెక్టర్ క్రిష్ కూడా హాజరయ్యారు. పవన్ తో క్రిష్ కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలు ఆపేసి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ కొనసాగాలని మీరు అనుకుంటున్నారని ప్రేక్షకులను అడగ్గా అందరూ అవునంటూ సమాధానం చెప్పినట్లు చూపించడం జరిగింది. ఈ ప్రోమోలో అలాగే ఒక అవ్వ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాను అని.. పవర్ ని అలా చూసిన తరువాతే మరణిస్తానంటూ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఆమెకాళ్ళకు దండం పెట్టడం జరిగింది. చివరిగా బాలకృష్ణ చెప్పిన డైలాగులకు పవన్ కళ్యాణ్ ఫిదా అయినట్లుగా ప్రోమోలో చూపించారు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.