రాజ‌మౌళి అంటే ఆ విష‌యంలో అస్స‌లు ఇష్టం లేదు… బాంబు పేల్చిన భార్య ర‌మా…!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పి ఆస్కార్ బరిలో కుర్చీ వేసుకుని కూర్చున్నట్లుగా తెలుగు సినిమా ఘనతను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు. ఇక ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు తెలుగోడి సత్తా ఏంటో చాటి చెప్పాయి. బాహుబలి సినిమాల‌తో ప్రభాస్ కి, త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను తీసుకువచ్చాయి.

త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటికీ ఎక్కడ చూసిన ఆ సినిమా పాటలు డైలాగులు, సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో త్రిబుల్ ఆర్ సినిమా హీరోలు, డైరెక్టర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.

SS Rajamouli, Maker of Myths

ఇందులో ప్రధానంగా డైరెక్టర్ రాజమౌళి గురించి ఆయన అలవాట్లు ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో వీడియోలు కూడా సోషల్ మీడియా లో తెగ చక్కెరలు కొడుతున్నాయి. ఇక గతంలో రాజమౌళి సతీమణి రమా రాజమౌళిని ఓ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు. ఆమె అక్కడ తన భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

RRR: SS Rajamouli Reveals How He Named The Movie & You Definitely ...

ఆ వీడియోలో రమా రాజమౌళి మాట్లాడుతూ.. రాజమౌళి ఇంట్లో ఎలా ఉంటారు..? సినిమా ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటారు..? అని అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ..” ఇంట్లో పిల్లలతో ఆయన చాలా జాలిగా నవ్వుతూ ఉంటారు. వారు చెప్పే ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా వింటూ గ్రహిస్తారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆయన చాలా టాలెంటెడ్ అంటూ త‌న భర్త గురించి పొగడ్తలు వర్షం కురిపించింది”.

Research on films: Historic wardrobes

” అదేవిధంగా డబ్బు పైన ఆయనకు ఎటువంటి వ్యామోహం ఉండదు. డబ్బు విషయంపై అసలు పట్టించుకోరు. ఎవరైనా సరే ఆయన దగ్గర డబ్బులు ఉండవచ్చు అన్న ఆలోచనతో ఆయనతో బయటకు వెళ్తే మాత్రం ఇబ్బంది పడాల్సిందే.. ఎందుకంటే ఆయన జేబులో చిల్లి గవ్వ కూడా ఉంచుకోర‌ని ఆమె తెలిపారు.

అయితే ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరమస్తుందో తెలియదు కాబట్టి ఆ సందర్భంలో డబ్బు అవసరం ఉంటే ఇబ్బంది పడతారు కదా.. అందుకే ఆయన కార్ డ్రైవర్ దగ్గర కొంత డబ్బు ఉంచమని ఇస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రాజమౌళి- మహేష్ బాబుతో చేయబోయే పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాకు సంబంధించి కథ విషయంలో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం చివర్లో కానీ వచ్చే సంక్రాంతి కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది.