యశోద విలన్ పై లైంగిక వేధింపుల కేసు.. అంత దారుణానికి దిగజారాడా..!

రాను రాను సమాజంలో అమ్మాయిలపై జరిగే దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఇక వారిలో చదువుకున్న వారు స్టేటస్ లో ఉన్నవారు అనే కాకుండా ప్రతి ఒక్కరు అమ్మాయిల విషయంలో తమ వక్రబుద్ధుని మర్చిపోవడం లేదు . ఇప్పుడు ఇందులో మరీ దారుణంగా సినిమా పరిశ్రమంలో కూడా ఇలాంటి దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి దారుణాలు ఎనో బ‌య‌టికి వచ్చినా అవి మాత్రం ఆగటం లేదు.

Unni Mukundan stars along with Samantha in 'Yashoda', will hit theatres on  November 11 - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

ఆఫర్లు ఇస్తామంటూ వచ్చిన అమ్మాయిని ఎవరైనా సరే అవకాశాలు పేరుతో వాడుకుని వదిలేయడం సినిమా పరిశ్రమలో ఎప్పటినుంచో వస్తున్న పాడు పని. కాగా ఇప్పుడు మలయాళ యంగ్ హీరో సమంత యశోద సినిమాలో నటించిన ఉన్ని ముకుందన్ కూడా ఇప్పుడు అలాంటి ఆరోపణలతో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఉన్ని ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త సంవత్సరం సమంత ప్రధాన పాత్రలలో వ‌చ్చిన యాశోద సినిమాలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగా రీసెంట్గా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ గురించి ఓ షాకింగ్ మేటర్ బయటపడింది. గతంలో ఓ అమ్మాయిని స్క్రిప్ట్ విషయంలో డిస్కషన్ చేయాలని పిలిపించుకొని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు .కాగా ఏదో విధంగా తన పలుకుబడితో సరాసరి ఆ అమ్మాయి పైనే తప్పుడు కేసు పెట్టి ఓ ఫేక్ డాక్యుమెంట్‌ను సృష్టించి కోర్టుకు సమర్పించాడు.

Kerala HC Withdraws Stay in Molestation Case Against Actor Unni Mukundan -  Sakshi

ఇక దీంతో ఆ అమ్మాయి వేసిన లైంగిక వేధింపుల కేసును కోర్ట్ కొట్టి పడేసింది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి హైకోర్టును ఆశ్రయించగా తను ఎలాంటి డాక్యుమెంట్ పై సంతకం చేయలేదని కోర్టులో వంగమూలం ఇచ్చింది. దీంతో మళ్ళీ ఆ కేసును రీ ఓపెన్ చేసింది కేరళ హైకోర్టు. ఈ విషయంపై సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ.. ఈ కేసులో తదుపరి అఫిడబిట్ దాఖలు చేయాలని ఉన్ని కి వార్నింగ్ ఇస్తూ ఈనెల 17 కు ఈ కేసును వాయిదా వేసింది.

Kerala High Court Lifts Stay On Trial Against Actor Unni Mukundan In Sexual  Harassment Case; Woman Alleges False Settlement Claim Made

ఇక దీంతో ఒకసారిగా ఉన్ని ముకుందానిపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువైపోయింది. పైకి పెద్దమనిషి లాగా కనిపిస్తూ ఇంత దారుణికి దిగజారుతాడా దుర్మార్గుడా.. అసలు నువ్వు మనిషివేనా అంటూ కొందరు ఎంతో దారుణంగా కామెంట్స్ చేస్తూ.. మరి ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు పడితే కానీ అమ్మాయిలు పై జరిగే దారుణాలు ఆగవు అంటూ తమ అభిప్రాయం సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తున్నారు.