లావైన అనుష్క శెట్టి.. భయానకంగా పెరుగుతున్న వీఎఫ్ఎక్స్ ఖర్చులు??

అనుష్క శెట్టి ఒకప్పుడు అబ్బాయిల కలల రాణిలా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎటువంటి పాత్రలోనైనా తన సత్తా చాటుకోగలిగే ప్రతిభ అనుష్కకి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు. ఇక ఇటీవలే చబ్బి లుక్స్‌తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది స్వీటీ. అనుష్క అంత బరువు ఎలా పెరిగింది అని ఆశ్చర్యపోతున్నారు.

అనుష్కకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఎప్పుడో ఒకసారి చెప్పింది. అందువల్లనే స్వీటీ అంత బొద్దుగా అయ్యి ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ విషయం పక్కన పెడితే, ఈ అమ్మడు పై ఇంకో కొత్త రూమర్ చక్కర్లు కొడుతుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమా తప్ప మరే కొత్త ప్రాజెక్ట్‌లో కనిపించడం లేదు. రెండేళ్ల నుండి కొనసాగుతున్న షూటింగ్ ఇప్పుడు ఎంతవరకు పూర్తయింది అనే విషయం ఎవరికీ తెలీదు.

అయితే అనుష్క తమిళ్ చిత్ర నిర్మాత AL విజయ్‌తో కలిసి నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో నటించడానికి అనుష్క ఎందుకు ఒప్పుకుంది అనే దానికి కారణం ఉంది అంటున్నారు. ఈ బబ్లీ హీరోయిన్ ని స్లిమ్ అవతార్‌లో చూపించడానికి తగిన విజువల్ ఎఫెక్ట్స్ వాడతామని డైరెక్టర్ విజయ్,అనుష్కకి మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. అమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో ఇలాంటి విజువల్స్ ని ఉపయోగించారు. దాంతో అమిర్ ఖాన్ 20 ఏళ్ల యువకిడిలా కనిపించాడు. ఇప్పుడు అనుష్క కూడా AL విజయ్ డైరెక్షన్ లో స్లిమ్ గా కనపడి అభిమానులను అలరించబోతుందన్న మాట.

Share post:

Latest