అదితీ రావు హైదరీ మొదటి భర్త అంత తోపా.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

టాలీవుడ్ లో తన తన అందచందాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీ. ఇక ఈమె గత కొంతకాలం నుంచి సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. ఇక సిద్దార్థ్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన మహాసముద్రం సినిమాలో అదితీ రావు హైదరీ, సిద్ధార్థ్‌కి జంటగా నటించింది.

Aditi Rao Hydari: థౌజండ్ వాట్స్ పవర్.. అదితిరావు అదుర్స్

ఈ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి ఘోరమైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది కానీ, వీళ్ళిద్దరికీ మాత్రం ఎంతో బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ, ఇక దీనికి తోడు రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి ఈ జంట కలిసి రావడంతో మరోసారి వీళ్ళిద్దరూ హాట్ టాపిక్ గా మారారు.

అదితీ (Aditi Rao Hydari)కి బర్త్ డే విషెస్ చెప్పిన సిద్ధూ (Siddharth).. ఆ  ఊహాగానాలకు ఊతమిచ్చేలా హీరో పోస్ట్!

ఇక దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే విషయం అందరికీ అర్థమవుతుంది. హీరో సిద్ధార్థ్ కి ఇదేమి మొదట ప్రేమ ఏమీ కాదు, గతంలో కూడా ఎంతోమంది హీరోయిన్లతో లవ్ ఎఫైర్లను చాలానే నడిపాడు. అదితీ రావు హైదరీ కూడా ఇది మొదటి ప్రేమ కాదు. 2009లోనే బాలీవుడ్ హీరో సత్యదీప్ మిశ్రా ని ప్రేమించి పెళ్లాడింది, అయితే పెళ్లయిన కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు విభేదాలు వస్తున్నాడంతో 2013లో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇతను నటిచింన‌ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా కూడా నిలిచాయి. వాటిలో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ అనే సినిమా ఇతనికి మంచి పేరును కూడా తీసుకొచ్చింది. అదితీ రావు హైదరీతో విడాకులు తీసుకున్న తర్వాత ఇతను మసాబా గుప్త అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉన్నాడు.

Masaba Gupta ties the knot with Satyadeep Misra, says 'married my ocean of  calm'. See post - India Today