పెళ్లికూతురుగా మారిపోయిన చైతూ లవర్..!!

తెలుగమ్మాయి శోభిత దులిపాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బ్లాక్ బస్టర్ హిట్ లతో లక్కీ ఛామ్ గా వెలిగిపోతోంది. గూడచారి ,మేజర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న చైతన్య లవర్ ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ తో సహా ది నైట్ మేనేజర్ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. తాజాగా ఈమె బ్యాక్ టు బ్యాక్ షూటింగులు , రిలీజింగ్ ప్రమోషన్లతో బిజీబిజీగా కడిపేస్తోంది ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 సినిమాలో వానతి పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె కెరియర్ పరంగా విలక్షణ పాత్రల ఎంపికలో అందరినీ మైమరిపిస్తుంది.

దేవ్ పటేల్ సరసన నటించిన హాలీవుడ్ చిత్రం ది మంకీ మ్యాన్ కి కూడా తన పాత్రకి డబ్బింగ్ చెప్పింది. దేవ్ పటేల్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం శోభిత మరొకవైపు సోషల్ మీడియా క్వీన్ గా కూడా ఒక వెలుగు వెలుగుతోంది. తాజాగా పాపులర్ వెడ్డింగ్ మ్యాగజైన్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. కొత్త పెళ్లికూతురు హయాలతో మెరిసిపోతున్న శోభిత లుక్కు యువతరం హృదయాలను ఆకట్టుకుంటుంది.

డార్క్ లిప్స్ గ్రీనిష్ డిజైనర్ డ్రెస్ తో పాటు దానికి కాంబినేషన్ క్రిస్టలీన్ ఆభరణాలు ధరించడంతో రిచ్ లుక్ ను తీసుకొచ్చాయి. తెలుగమ్మాయి మతి చెడే హోయలు పోతోందని ప్రేక్షకులు చెబుతున్నారు అంతేకాదు. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి .మొత్తానికైతే శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి నెటిజన్లు కూడా ఇంత అందాలు చూసి తట్టుకోగలమా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest