NBK-108 కి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న బాలయ్య..!!

బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో సక్సెస్ మీద ఉన్నారు బాలయ్య. ఇప్పుడు ఇదే తరహాలోనే  సీనియర్ అగ్ర హీరోలలో స్థానం సంపాదించారు. ఇక తన రెమ్యూనిరేషన్ ని కూడా ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2021 డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో సక్సెస్ అందుకొని మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి బాలయ్య రూ .10కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

nandamuri balakrishna, NBK 108: అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్..  బాలకృష్ణ నెవర్ బిఫోర్ అట! - nandamuri balakrishna anil ravipudi next nbk 108  kick starts with pooja ceremony - Samayam ...

ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రూ .15 కోట్లు తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా అనిల్ రావుపూడి దర్శకత్వములు తన 108వ చిత్రాన్ని బాలకృష్ణ తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమాకి దాదాపుగా రూ .20 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని సాహో గారికపాటి హరీష్ నిర్మిస్తూ ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల కూడా నటిస్తున్నది. మరి బాలయ్య ప్రతి సినిమాకు కూడా ఇలా రెమ్యూనరేషన్ విషయంలో పెంచుకుంటూ వెళ్తూ ఉండడంతో నిర్మాతలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమా బడ్జెట్ తక్కువ బడ్జెట్ తోనే సినిమాలను తెరకెక్కించడంతో లాభాలు కూడా బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే బాలయ్యతో సినిమాలు తీయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.