ఆ సీనియర్ హీరోతో అనుష్క రొమాన్స్.. అలిగిన ప్రభాస్.. పెరిగిన దూరం??

ప్రభాస్, అనుష్కల రిలేషన్‌షిప్ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి మధ్య అఫైర్ కూడా ఉందని చాలామంది నమ్ముతుంటారు. ఈ జంట మధ్య ఏదో ఉన్నట్లు ఇప్పటికీ చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. కొందరు ప్రభాస్, అనుష్క లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. వారు త్వరలో వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు వ్యాప్తి చేసే స్థాయికి కూడా వెళ్లారు. అయితే, తమ మధ్య ఏమీ లేనట్లే ప్రభాస్, అనుష్క వ్యవహరిస్తున్నారు. తరువాత ప్రభాస్ కృతి సనన్‌తో రిలేషన్ పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి కాగా వాటిని వీరిద్దరూ కొట్టిపారేశారు.

అనుష్క విషయంలోనే ఎవరు ఏం మాట్లాడలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక ప్రచారం ప్రకారం ఒక కారణంతో అనుష్కను ప్రభాస్ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి చాలా మంది హీరోలు అనుష్క సరసన నటించడానికి ఇష్టపడతారు. నిర్మాతలు, దర్శకులు కూడా ఆమె చాలా కోపరేటివ్ కాబట్టి తమ సినిమాల్లో తీసుకుంటుంటారు. ఇన్‌సైడ్ టాక్ ఏమిటంటే, ఆమెకు ఇండస్ట్రీ వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాగా ఒక టాప్ స్టార్ సరసన ఒక చిత్రంలో అనుష్క ఫస్ట్ నైట్ సన్నివేశంలో నటించింది. వారి మధ్య రొమాన్స్ బాగా పండింది.

అయితే అనుష్క ఇలాంటి సన్నివేశంలో నటించడమే ప్రభాస్‌ను ఆగ్రహానికి గురి చేసిందని, అప్పటి నుంచి ఈ హీరో అనుష్కను పట్టించుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తల్లి కూడా తన కోడలు ఎవరు అయినా సరే ఇంటిపట్టునే ఉండాలని, ఏ పనులు చేయకూడదని కూడా అంటున్నారట. ఆ విధంగా ఆమె అనుష్క ని రిజెక్ట్ చేశారట. మొత్తం మీద ప్రభాస్, అనుష్కల మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో వారికే తెలియాలి.

Share post:

Latest