బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవలె పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఫైనల్ గా ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
ఫిబ్రవరి 12న ముంబైలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ అత్యంత ఘనంగా జరిగింది. బాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రిముఖులు రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వించారు. పెళ్ళి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడిప్పుడు ఈ జంట ఫ్రీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో సిద్ధార్థ్ కు కియారా షాక్ ఇచ్చింది. పెళ్లైన ఇరవై రోజులకే బ్యాక్ టూ వర్క్ అంటూ భర్తను వదిలేసింది.
కనీసం నెల రోజులు అయినా భర్తతో టైమ్ స్పెండ్ చేయకుండా షూటింగ్స్ లో బిజీగా మారింది. తాజాగా మేకప్ వేసుకుంటున్న పిక్ ను షేర్ చేస్తూ `బ్యాక్ టు వర్క్` అని కియారా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో `పాపం.. సిద్ధార్థ్` అంటూ నెటిజన్లు సరదాగా సెటైర్లు పేలుస్తున్నారు. కాగా, కియారా ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `ఆర్సీ 15` ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ ను కియారా టేకప్ చేసింది.