క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్‌` క‌లెక్ష‌న్స్‌.. 5 రోజుల్లో స‌గం కూడా రాలేదు!

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా చేయ‌గా.. క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు.

బింబిసార వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌చ్చిన మూవీ కావ‌డంతో అమిగోస్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఆ అంచనాల‌ను అందుకోవ‌డంలో ఓ సినిమా విఫ‌లం అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రూ. 11.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది.

అయితే ఐదు రోజులు గ‌డిచే స‌మ‌యానికి టార్గెట్ లో స‌గం కూడా రాబ‌ట్టలేక‌పోయింది. ఐదో రోజు క‌లెక్ష‌న్స్ లో డ్రాప్స్ మ‌రింత పెరిగాయి. 5వ రోజు . తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా రూ. 23 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా రూ. 27 లక్షల షేర్ తో స‌రిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా అమిగోస్ 5 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.43 కోట్లు
సీడెడ్: 94 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 62 ల‌క్ష‌లు
తూర్పు: 45 ల‌క్ష‌లు
పశ్చిమ: 27 ల‌క్ష‌లు
గుంటూరు: 57 ల‌క్ష‌లు
కృష్ణ: 41 ల‌క్ష‌లు
నెల్లూరు: 24 ల‌క్ష‌లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 4.93 కోట్లు(8.20 కోట్లు~ గ్రాస్‌)
————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 31 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ – 68 ల‌క్ష‌లు
————————————–
టోట‌ల్ క‌లెక్ష‌న్స్ = 5.92 కోట్లు(10.30 కోట్లు~ గ్రాస్)
————————————–

కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 6.08 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ళ్యాణ్ రామ్ ఈ టార్గెట్ ను రీచ్ అవ్వ‌డం క‌ష్ట‌మే.