నిర్మాతల విషయంలో బాలయ్య చేస్తున్న పని కరెక్టేనా..?

నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎంతో మంది బాలకృష్ణ ఎవరి మాట వినరని ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అలా ఆయనతో ఎంతోమంది నిర్మాతలు,దర్శకులు పొగడ్తలు కురిపించి పని చేయించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కూడా తెలుగు పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత బాలయ్య కు కనీసం రెండు కోట్ల రూపాయల రేమ్యనరేషన్ ఇవ్వకుండానే ఏకంగా ఒక సినిమాలో నటింపజేసేలా చేశారట.

Balaya as gangster Archives - Movie Stars and Artists - Biographies |  Bollywood | South | Bengali

ప్రస్తుతం బాలయ్య మార్కెట్ విలువ కనీసం రూ.30 కోట్ల రూపాయలు ఉంటుంది. అందులో రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం ఆ నిర్మాత తనని అభిమానించాడని ఒక ఉద్దేశంతోనే అతి తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కొన్ని సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసారట. ఫ్లాప్ అయిన సినిమాలు నిరాశపరచడంతో దాంతో నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఇలా చేస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

అయితే ఇలా కొంతమంది నిర్మాతలు కూడా రెమ్యూనరేషన్ ఎగ్గొట్టినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తుంటాయి. బాలయ్యకు కథ నచ్చితే చాలు రెమ్యూనరేషన్ ని అసలు పట్టించుకోరు. ఇది అదునగా చూసుకొని కొంతమంది నిర్మాతలు ఆయనను మోసం చేస్తూ ఉంటారు.కొంతమంది నమ్మించి తక్కువ వసూలు వచ్చాయని చెప్పి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా తప్పించుకున్న వారు ఉన్నారని వార్తలు వినిపిస్తుంటాయి.