రూ. 12 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `అమిగోస్‌` రాబ‌ట్టింది ఇదే!

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. బింబిసార వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మిది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్‌ టాక్ ల‌భించింది.

టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంలో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం పెద్ద‌గా హ‌వా చూపించ‌లేక‌పోతోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు యాభై శాతం డ్రాప్స్‌ క‌నిపించినా.. మూడో రోజు సండే కావ‌డంలో కొంచం బెటర్ గానే కలెక్షన్స్ ని రాబ‌ట్టింది. రెండో రోజు రూ. 1.11 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు సినిమా రూ.1.21 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా అమిగోస్ 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.28 కోట్లు
సీడెడ్: 80 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 55 ల‌క్ష‌లు
తూర్పు: 41 ల‌క్ష‌లు
పశ్చిమ: 24 ల‌క్ష‌లు
గుంటూరు: 51 ల‌క్ష‌లు
కృష్ణ: 35 ల‌క్ష‌లు
నెల్లూరు: 21 ల‌క్ష‌లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 4.35 కోట్లు(7.15 కోట్లు~ గ్రాస్‌)
————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 30 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ – 60 ల‌క్ష‌లు
————————————–
టోట‌ల్ క‌లెక్ష‌న్స్ = 5.25 కోట్లు(9.00 కోట్లు~ గ్రాస్)
————————————–

కాగా, రూ. 11.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 6.75 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.