సాహో డైరెక్టర్ తో సినిమాకి పవన్ కళ్యాణ్ అన్ని కొట్లు తీసుకుంటున్నారా..?

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో.. రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీంతో అవకాశం వచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యనే డైరెక్టర్ సుజిత్ తో కూడా ఒక సినిమాకు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Review Rowdies: Pawan Kalyan to be seen as Original Gangster
ప్రభాస్ సాహో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సుజిత్ పవన్ కళ్యాణ్ తో మరొక సినిమాని ప్లాన్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జనవరి 30వ తేదీన ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఈ సినిమాలో వచ్చే లాభాలలో మూడోవంతు తీసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ అగ్రిమెంట్ తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్ర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తో కలిపితే.. రూ.175’కోట్ల రూపాయలు పైగా బడ్జెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రూ .200 కోట్లు మార్కెట్ ని దాటగలడేమో చూడాలి మరి.