సుఖానికి అల‌వాటు ప‌డ్డా.. అందుకే సినిమాలు చేయ‌ట్లేదు.. న‌టి హేమ బోల్డ్ కామెంట్స్‌!

న‌టి హేమ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన హేమ‌.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. వెండితెర‌పై వ‌దిన‌, అక్క‌, భార్య పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన ముద్ర వేసింది.

అయితే ఈ మ‌ధ్య ఆమె ఎక్కువ‌గా సినిమాల్లో న‌టించ‌టం లేదు. అయితే సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి అనేది హేమ వివ‌రించింది. రీసెంట్‌గా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు హోట‌ల్ కొత్త బ్రాంచీని మ‌ణికొండ‌లో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టి హేమ సంద‌డి చేశారు.

అనంత‌రం ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ ఛానెల్ తో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే `ఇటీవ‌ల సినిమాల్లో ఎందుకు న‌టించ‌టం లేదు?` అని ప్ర‌శ్నించ‌గా.. `కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సంపాద‌న ఎక్కువై పోయి, సుఖ ప‌డ‌టానికి అల‌వాడు ప‌డిపోయాను, క‌ష్ట‌ప‌డ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. అందుకే సినిమాలు చేయ‌ట్లేదు` అంటూ సెటైరిక‌ల్‌గా స‌మాధానం ఇచ్చింది. దీంతో హేమ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.