నేషనల్ అవార్డు విన్నర్‌తో కలిసి వెంకటేష్ కొత్త మూవీ.. ఇక పునకాలే??

ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ మంచి కథలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. కాగా అతను కొన్ని నెలలుగా ఏ సినిమాలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో 75వ చిత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాను ఈ రోజు హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. శైలేష్ కొలను అనే దర్శకుడు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో కె రాఘవేంద్రరావు, నాని, తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుండగా మూవీ 2023, డిసెంబర్ నెలలో విడుదల కానుంది.

బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. హై బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ జనాలకు బాగా నచ్చింది. వెంకటేష్ ప్రోమోను పంచుకుంటూ “నా నెక్స్ట్ సినిమా చాలా ప్రత్యేకమైన చిత్రం” అని రాశారు.

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. నవాజుద్దీన్ ఎంత అద్భుతంగా నటిస్తాడో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో అతడు జీవిస్తాడు. అతడి నటన చూస్తే పూనకాలు రావడం ఖాయం. అలాంటి టాలెంటెడ్ నటుడితో విక్టరీ వెంకటేష్ లాంటి మాస్ హీరో కలిసి సినిమా చేస్తే కెవ్వు కేకే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే టెస్ట్ షూట్ కోసం మేకర్స్ చాలా డబ్బు ఖర్చు చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో నెరిసిన గెడ్డంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇకపోతే వెంకటేష్ త్వరలో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానాతో కలిసి తన OTT డెబ్యూ చేయనున్నాడు. ఈ సిరీస్‌లో రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.