అబ్బాయ్ కే దిక్కులేదు..ఇక బాబాయ్ కి కూడానా..? పవన్ డైరెక్టర్ పరువు పాయే..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న దర్శకులకు కొదవలేదు. ఇలాంటి దర్శకుల జాబితాలో ముందు వరుసలో హరీష్ శంకర్ కూడా ఉంటాడు. రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్కు పరిచయమైన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో అగ్రదర్శకుల జాబితాలో చేరాడు.

Pawan Kalyan will team up with director Harish Shankar, confirms Mythri  Movie Makers - India Today

హరీష్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉండటంతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాల‌ తర్వాత హరీష్ శంకర్ నందమూరి హీరో ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదలై ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.

ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ ఇండస్ట్రీలో పుడతాడా.. ఈ కామెంట్లు చేసిన  డైరెక్టర్ ఎవరో తెలుసా | harish shankar comments about junior ntr goes viral  in social media details, junior ...

ఈ సినిమాను హరీష్ రొటీన్ కథతో తెరకెక్కించి ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర నిరాశ‌కు గురిచేశారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో హరీష్ శంకర్ కూడా కొన్నాళ్లపాటు చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. మళ్లీ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గ‌ద్దల కొండ గణేష్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ మళ్ళీ అవకాశం ఇస్తే తానేంటో ప్రూవ్ చేసుకుంటాను అని కూడా చెప్పుకొచ్చాడు.

పవర్ స్టార్ డైరెక్టర్ తో బాలయ్య.. వర్కౌట్ అయ్యేనా | Harish Shankar Aspires  To Work With Balayya , Balakrishna, Anil Ravipudi, Harish Shankar, Pawan  Kalyan, Ustaad Bhagat Singh - Telugu Anil Ravipudi, Balakrishna ...

అయితే ఇప్పుడు హరీష్- బాలయ్య కాంబోలో రాబోయే రోజుల్లో కచ్చితంగా ఓ సినిమా రానుంది. రామయ్య వస్తావయ్య రిజల్ట్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో నందమూరి అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. హరి శంకర్ మాత్రం ఇసారి బాలయ్యతో కచ్చితంగా హీట్ కొడతానని నమ్మకంతో ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.