వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో వున్న మాస్ స్టార్స్ మరే ఇతర భాషల్లో కూడా ఉండరనే చెప్పుకోవాలి. అవును, మనదగ్గర అరడజనకు పైగా మాస్ ఫాలోయింగ్ వున్నవారు వున్నారు. ఇక వారి సినిమా వస్తుందంటే చాలు, ఫాన్స్ కి జాతరే. ఇక అలాంటి స్టార్స్ వరుస విజయాలను పొందితే ఎలా ఉంటుంది? ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధులే వుండవు కదూ. అవును, ఒకప్పుడు వరుస పరాజయాలు చూస్తున్న స్టార్స్ ఇపుడు వరుస హిట్లను ఇస్తూ ఫాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాల హవా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఈ లిస్టులో మొదటివాడు నందమూరి బాలకృష్ణ. దాదాపు ఓ 5 సంవత్సరాల క్రితం వరకు వరుస పరాజయాలు చూసిన బాలయ్య బోయపాటి పుణ్యమాని వరుస హిట్స్ మీద హిట్స్ ఇచ్చి నందమూరి అభిమానులకి పిచ్చెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే సింహా, లెజెండ్, అఖండ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ ఊపు ఊపాయి. ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దాదాపు పదేళ్ళపాటు విజయం చవిచూడని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసాడు.

నాటినుండి మొన్న రిలీజైన భీమ్లా నాయక్ వరకు పవన్ వరుస హిట్లు మీద హిట్లిచ్చి మెగాభిమానులకు కిక్కిస్తున్నాడు. ఆ తరువాత టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి చెప్పుకోవచ్చు. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాల విజయాలతో మహేష్ బాబు మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగింది. ఆ తరువాత అందరివాడు మెగాస్టార్ రికార్డ్స్ గురించి చెప్పుకోవాలి. దాదాపు ఓ దశాబ్దంపాటు సినిమాలకు దూరమైన చిరు ఖైదీ నెం 150, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య విజయాలతో యువనటులకు సైతం షాకిస్తున్నారు అంటే నమ్మి తీరాలి. వాల్తేరు వీరయ్య ఏకంగా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుండటం గమనార్హం.