పైట లేకుండా చెమ‌ట‌లు ప‌ట్టించిన హ‌న్సిక‌.. పెళ్లి త‌ర్వాత కూడా ఇంత‌లా టెంప్ట్ చేస్తుందేంటి?

యాపిల్ బ్యూటీ హ‌న్సిక గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. ముంబై కి చెందిన బడా వ్యాపారవేత్త సోహెల్ ఖతురియాతో హ‌న్సిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జైపూర్‌లోని చారిత్రక ముండోతా కోటలో కుటుంబ స‌బ్య‌లు, అత్యంత స‌న్నిహిత‌ల న‌డుమ హ‌న్సిక, సోహెల్ ఒక‌ట‌య్యారు.

హన్సిక పెళ్లి వీడియోని ఓటీటీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. హట్‌ స్టార్‌ ఈ పెళ్లి వీడియో హక్కులను సొంతం చేసుకుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈమె న‌టించిన `105మినిట్స్` , `మై నేమ్‌ ఈజ్‌ శృతి` చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

అలాగే తమిళంలో `పార్టనర్‌`, `రౌడీ బేబీ`, `గార్డియన్‌`, `అరన్మనై 4`, తోపాటు మరో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతోంది.

పెళ్లి త‌ర్వాత కూడా అందాల ఆర‌బోత‌లో అస్స‌లు త‌గ్గ‌డం లేదు. తాజాగా పైట లేకుండా హోయలు పోతూ చెమ‌ట‌లు ప‌ట్టించింది. టెంప్టింగ్‌ పోజులతో నానా రచ్చ చేస్తుంది. కసిగా చూస్తూ చూపులతోనే చంపేస్తుంది. హ‌న్సిక తాజా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.