శాకుంతలం సినిమా కోసం సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..?

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో.. సమంత కీలకపాత్ర పోషిస్తున్న చిత్రం శాకుంతలం. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. సమంత కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం సరిగా మూడు నెలలు మాత్రమే షూటింగ్లో పాల్గొనింది. ఈ సినిమాలో ఎక్కువగా షూటింగ్ మొత్తం గ్రాఫిక్స్ లోనే షాట్స్ ఉన్నాయట.

దాంతో సమంత ఎక్కువగా కష్టపడకుండానే ఈజీగా వర్క్ పూర్తయినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం సమంత తీసుకున్న పారితోషకం ఎంత అంటూ కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా సమంత హీరోయిన్గా ఒక సినిమాలో చేస్తే రూ.2 కోట్ల పారితోషకం తీసుకుంటుంది. కానీ ఈ సినిమా మొత్తం సమంత పైన ఆధారపడి ఉంది కాబట్టి ఈ సినిమా కోసం రూ.3కోట్ల పారితోషకం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడం వల్లే ఆమె ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆమె ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవ్వడానికి ఓకే చెప్పిందట. అందుకే ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమయం కేటాయించిందని.. ముఖ్యంగా సమంతను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయించాలని గుణశేఖర్ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మంచి బజ్ క్రియేట్ అవుతుందని అందుకే సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ చేపట్టబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సమంత ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు.