సునీల్ లక్ మామూలుగా లేదుగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కామెడీన్ గా సుదీర్ఘ కాలం పాటు తన కెరీర్ ని మొదలుపెట్టిన కమెడియన్ సునీల్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ మధ్య మళ్ళీ కమెడియన్గా తన కెరీర్ ని కొనసాగించారు. అయితే ఇన్నాళ్లు కమెడియన్ గా కామెడీ హీరోగా సునీల్ ను చూసిన జనాలు పుష్ప సినిమాల మంగళం శ్రీను పాత్రలో విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక అంతకుముందు సునీల్న కొన్ని సీరియస్ పాత్రలలో చూసాము కానీ మంగళం శ్రీను పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

Tollywood actor Sunil roped in for Vishal and SJ Suryah's Mark Antony |  Tamil Movie News - Times of India
అందుకే ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి స్టార్ హీరో నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు సునీల్. అంతేకాకుండా మరొక తమిళ సినిమాలో కూడా సునీల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అదే డార్క్ షేడ్ లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాల్ మార్క్ ఆంటోని సినిమాలో సునీల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. సునీల్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ను విడుదల చేయడం అంటే మార్క్ ఆంటోనీ లోని సునీల్ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

രജനികാന്തിനൊപ്പം മാത്രമല്ല വിശാല്‍ നായകനാകുന്ന ചിത്രത്തിലും സുനില്‍
ఒకవైపు కామెడీగా తన సినిమాలతో అలరించిన సునీల్ ఆ తర్వాత హీరోగా ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు విలన్ గా కూడా అదరగొట్టేస్తున్నారు ఒకవైపు తెలుగు మరొకవైపు తమిళ్ సినిమాలలో బిజీగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం సునీల్ చేతులో నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.