బండ్ల గణేష్ పైన సెటైర్ వేసిన షకలక శంకర్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా రవితేజ హీరోయిన్గా శ్రీ లీల నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజని పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బండ్ల గణేష్ కు చేతిలో మైకు ఉంటే చాలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీని నిలబెట్టిన వారి గురించి చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ పైన టాలీవుడ్ కమెడియన్ షకలక శంకర్ తాజాగా ఫైర్ కావడం జరిగింది.

అవసరమే ఇక్కడ కత్తులు దూయిస్తుంది .. కలిసిపోయేలా చేస్తుంది: బండ్ల గణేశ్
తాజాగా రాజయోగం సినిమా కోసం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన ఒక ప్రెస్ మీట్ లో షకలక శంకర్, తాగుబోతు రమేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ పైన తనదైన స్టైల్ లో కౌంటర్ వేయడం జరిగింది. అయితే కేవలం బండ్ల గణేష్ పేరు చెప్పకుండానే ఫైర్ కావాల్సి వచ్చిందని సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఇక అసలు విషయంలోకి వెళితే కొంతమంది మైక్ తీసుకొని మాట్లాడుతారయ్య వాళ్లకి శతకోటి దండాలు..ఎందుకంటే వారు ఏం మాట్లాడతారో వారికి అర్థం కాదు నిన్న మొన్న ఒక ప్రొడ్యూసర్ ఏదో అన్నాడు రెండు మూడు సంవత్సరాలు ఏదో ట్రై చేసే అదృష్టవశాత్తు సూపర్ స్టార్స్ మెగాస్టార్ అయిపోయారు అంటూ కామెంట్స్ చేశారు.

అయితే వారు స్టార్ డం రావడానికి ఎన్నో సంవత్సరాలు పగలు రాత్రి సరైన తిండి తిప్పలు లేక కష్టపడ్డారని అందుచేతనే వారు స్టార్స్ అయ్యారని తెలియజేశారు. అలా అనేవాడికి ముందు ఆ విషయం అర్థం కావాలి ఏ ఉద్దేశంతో అన్నారో తెలియక మైకు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఎవరు హీరో ఉన్నారు అని నువ్వు ఉబ్బిపోయి తప్పిపోయి మైమరచి నీ బుర్రలో ఏముందో కూడా మరిచిపోయి మాట్లాడడం మంచిది. కాదు అంటూ ఫైర్ అయ్యారు. మరి ఈ విషయంపై బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.