బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2` మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `లైగర్` సినిమాకు సైన్ చేసింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అవ్వాలని ఆశ పడింది. కానీ, ఆమెకు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది.
లైగర్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తో అనన్యకు ఆఫర్లకు కూడా బాగా తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా గ్లామర్ షో చేస్తోంది. తాజాగా సముద్రం ఒడ్డున బికినీతో తన అందాలతో బంతాడేసింది. అనన్య హాట్ నెస్ కు ఇంటర్నెట్ కూడా బ్రేక్ అవుతోంది.
అనన్య న్యూ ఇయర్ ట్రీట్ కు కుర్రాళ్లు ఆగమాగం అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అనన్య లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.