య‌శోద‌కు స‌మంత కంటే ఆ హీరోయిన్ బెట‌ర్ ఆప్ష‌న్‌.. ప‌రుచూరి హాట్ కామెంట్స్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి రీసెంట్ గా వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమా యశోద.. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులను మెప్పించింది. ఛాలెంజింగ్ పాత్రల అంటే ఎంతో ఇష్టపడే సమంత ఈ సినిమాల్లో కూడా యాక్షన్స్ సన్నివేశాలలో ఆదరగొట్టింది. ఇక ఈ సినిమాతో సమంత మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Yashoda Box Office Collection Day 1: Off to a good start! - JanBharat Times

ఈ క్రమంలోనే సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూనే ఈ సినిమాను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను హరి అండ్ హరీష్ ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించారు. అయితే తాజాగా సీనియర్ ర‌చయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. యశోద సినిమా పురిటి పిల్లల ప్లాస్మాతో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపార చేయడం దాని వెనక ఒక పెద్ద మాఫియాని క్రియేట్ చేయడం ఎంతో అద్భుతంగా ఉంది అని అన్నారు.

యశోదలో ఆమె నటించి ఉంటే బాగుండేదన్న పరుచూరి.. సామ్ పరువు పోయేలా | Paruchuri  Gopalakrishna Interesting Comments On Samantha Yashoda Movie Paruchuri  Gopala Krishna, Tollywood, Samantha, Yashodha Movie ...

సమంత ఈ సినిమాలో తన చెల్లిని రక్షించుకునే ప్రయత్నంలో ఎంతో రిస్క్ చేసి ఆ మాఫియాను అంతం చేస్తాం కూడా బాగుంది అని అన్నారు. సమంత పోలీస్ ఏజెంట్‌గా కూడా ఎంతో అద్భుతంగా నటించింది.
అయితే ఇలాంటి సినిమాలను సీనియర్ హీరోయిన్ విజయశాంతి తన కెరియర్ పిక్ స్టేజ్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో సెన్సేషనల్ రికార్డులను సృష్టించింది. అయితే ఇప్పుడు సమంత నటించిన యశోద సినిమా విజయశాంతి బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంద‌న్నారు.

అప్ప‌టిలో విజయశాంతి ఇలాంటి సినిమాలు చేసి ఉంటే ఇంకా పవర్ ఫుల్ గా ఉండేది అని పరిచూరి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సమంత కూడా ఎంతో అద్భుతంగా నటించిందని అందుకే ఆమె స్టార్ హీరోయిన్‌గా ఉంది అంటూ పరుచూరి ఆమెను ప్రశంసించారు. అయితే ప్రస్తుతం పరుచూరి గోపాలకృష్ణ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.