చీరకట్టులో పూర్ణ హోయల‌కు విల‌విల‌మంటున్న కుర్రాళ్లు.. కానీ అదొక్క‌టే డౌట్‌!

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళ లో జన్మించినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే పూర్ణ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై పాలు టీవీ షోల‌కు జ‌డ్జ్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలె పూర్ణ ఓ ఇంటిది అయింది.

దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని గ‌త ఏడాది ఆరంభంలో అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన పూర్ణ‌.. వివాహం మాత్రం చాలా ర‌హ‌స్యంగా చేసుకుంది. పెళ్లైన రెండు, మూడు నెల‌ల త‌ర్వాత ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే పూర్ణ‌.. తాజాగా చీర‌క‌ట్టులో అందంగా ద‌ర్శ‌క‌నమిచ్చింది. చీర‌లో పూర్ణ హోయ‌ల‌కు కుర్రాళ్లు విల‌విల‌మంటున్నారు.

ప్ర‌స్తుతం పూర్ణ తాజాగా ఫోటోలో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే అంద‌రికీ ఒక‌టే డౌట్‌. అదేంటంటే.. గ‌త ఏడాది తాను ప్రెగ్నెంట్ అంటూ పూర్ణ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కానీ, తాజా ఫోటోల్లో పూర్ణ తల్లి అయిన ఆనవాళ్లు ఏమీ లేవనే వాదన వినిపిస్తోంది. మూడు నెలలకే గర్భిణీ స్త్రీలకు బేబీ బంప్ రివీల్ అవుతుంది. కానీ, పూర్ణ లేటెస్ట్ పిక్స్ అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో పూర్ణ నిజంగా ప్రెగ్నెంటా..? అంటూ కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.