నటుడు శర్వానంద్ నిశ్చితార్థ వేడుక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట పలు చిత్రాలలో నటించిన నటుడు శర్వానంద్.. హీరోగా ప్రస్తుతం పలు సినిమాలలో నటించి యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ ఉన్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి శర్వానంద్ వివాహ వేడుకల గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శర్వానంద్ కు సంబంధించి కొన్ని నిశ్చితార్థపు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ తరుణంలో అభిమానులు సైతం కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

Sharwanand – Rakshitha reddy Engagement Photos

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరైన శర్వానంద్ త్వరలోనే వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్నారు. యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న రక్షిత రెడ్డి అనే అమ్మాయిని త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అందుకు సంబంధించి నిశ్చితార్థపు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. కేవలం అతి కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుకలు జరగబోతున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్.. భార్య ఉపాసనతో కలిసి హాజరు కావడం జరిగింది. శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో పలువురు అభిమానులు, సినీ సెలబ్రిటీలు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

ఇక ఇలాంటి సమయంలోనే శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరని ఆరా తీయగా ఈమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈమెకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి త్వరలోనే అధికారికంగా వివాహ తేదీని కూడా ప్రకటిస్తారేమో చూడాలి మరి. ఏదిఏమైనా ఈ ఏడాది మొదటిలోనే శర్వా శుభవార్త చెప్పడంతో అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు.