సలార్ సినిమా నుంచి కొత్త ఏడాది అప్డేట్..!!

కే జి ఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో తన తదుపరి చిత్రం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని ప్రకటించారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నది. హీరోయిన్ గా ఇందులో శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి ఇప్పటివరకు అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల కావాల్సి ఉండేది కానీ సినిమా షూటింగ్ ఇప్పటికి చివరి దశలో ఉన్నందువలన ఆలస్యం అవుతోంది. ఇక పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమాని తనకి ఎక్కిస్తూ ఉన్నారు.

Salaar Movie OTT Release Date - Digital Rights | Watch Online | Streaming  Online - OTT Raja
ఈ ఏడాది కొత్త సంవత్సరం సలార్ కొత్త షెడ్యూల్ ని ఈనెల 8వ తారీకు నుంచి మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలో ప్రారంభం కాబోతున్న ఈ షెడ్యూల్ క్లైమేక్స్ కు చెందిన సన్నివేశాలు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది అని సమాచారం. యాక్షన్ సన్నివేశాలు మరియు భారీ ఎత్తున చిత్రీకరించేందుకు డైరెక్టర్ చివరి షెడ్యూల్ ని భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణాన్ని కూడా హొంబలే వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సలార్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షూటింగ్ అనుకున్నట్లుగా జరిగి ఉంటే మాత్రం ఈ ఏడాది మొదట్లోనే సలార్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ ఫోన్ చేశారని వార్తలు వినిపించాయి. మరి ఏ మేరకు ప్రభాస్ అభిమానులను ఈ సినిమా సంతృప్తి పరుస్తుందో చూడాలి.