ఈ సినిమా ట్రైలర్స్ లో ప్రేక్షకులకు బాగా నచ్చిన ట్రైలర్ ఇదే…!!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అవేంటంటే, తెగింపు, వారసుడు, వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం. ఈ సినిమాల్లో మూడు భారీ మాస్ యాక్షన్ సినిమాలు కాగా మిగతావి మామూలు సినిమాలు. అయితే ఈ అన్ని సినిమాలు కూడా ఈసారి బాగా డబ్బులు వసూలు చేస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే వీటి ట్రైలర్లు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఐదు సినిమాల ట్రైలర్లు కొద్దిరోజుల క్రితమే విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ పొందాయి. ప్రస్తుతానికైతే ఈ ట్రైలర్లలో ఒకటి మాత్రమే ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అజిత్ కుమార్, మంజు వారియర్ నటించిన తెగింపు మూవీ ట్రైలర్ రొటీన్ గానే ఉంది. సో, టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ట్రైలర్ పెద్దగా నచ్చలేదు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్ లోనే రిలీజ్ అవుతుంది. నిజానికి, దీనికి పెద్దగా రెస్పాన్స్ కూడా లేదు. ఇక దళపతి విజయ్ సినిమా వారసుడు ట్రైలర్ కూడా కొత్తగా అనిపించలేదు. సో, ఈ నెల 11న విడుదలవుతున్న తెగింపు, వారసుడు సినిమాల ట్రైలర్లు రొటీన్ గానే అనిపించాయి. సినిమాలు కూడా రొటీన్ గానే ఉంటాయని ఒక భావనను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాయి.

ఇక కళ్యాణం కమనీయం ట్రైలర్ బాగానే ఉన్నా పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా కలక్షన్లను రాబట్టడం చాలా అసాధ్యం. ఇకపోతే బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ట్రైలర్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఒక ఫీలింగ్ ప్రేక్షకుల్లో కూడా బలపడింది. చివరిగా రిలీజ్ అవుతున్న చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య కూడా అంచనాలు పనిచేసింది. ఈ మూవీ ట్రైలర్ కూడా మెగా ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసింది.