పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్న బుల్లితెర యాక్ట్రెస్.. ఎవరంటే?

ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం సెలబ్రిటీలకు చాలా సులభం అయింది. ఈ విషయాన్ని గమనించిన బుల్లితెర, వెండితెర నటీనటులు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి తమకు సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఎక్కువ వ్యూస్‌ సంపాదిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ జాబితాలో “జానకి కలగనలేదు” సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ కూడా ఉంది. మాటీవీలో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్‌ చాలా పాపులర్ అయింది. దానికి కారణం ఈ సీరియల్ లో లీడ్ రోల్ చేస్తున్న ప్రియాంక జైన్ అని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో పదహారణాల అచ్చు తెలుగు అమ్మాయిలా చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకుంటూ యూట్యూబ్ వీడియోలు పెడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కూడా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె సీమంతం చేసుకున్నట్లు కనిపించింది. నిజానికి 25 ఏళ్ల కుర్రది అయిన ప్రియాంకకి ఇంకా పెళ్లి కాలేదు. మరి ఆమె ప్రెగ్నెంట్ కావడం ఏంటి? సీమంతం చేయడం ఏంటని చాలామంది వీడియో థంబ్‌నెయిల్ చూడగానే అవాక్కయ్యారు. అయితే వీడియో అంతా చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. అదేంటంటే ప్రియాంక నిజంగా తల్లి కాలేదు.

ఆమెకు చేసిన సీమంతం అనేది సీరియల్ సీక్వెన్స్ లో ఒక భాగమట. ఈ సీరియల్‌లో ఆమె గర్భవతిగా కనిపించాలట. అలానే సీమంతం చేసుకునేటట్లు ఒక సన్నివేశం ఉంటుందట. అదే సన్నివేశం గురించి ఈమె వీడియో ద్వారా తెలియజేసింది. అయితే మొదటిది నేను చూసే చాలామంది ఆశ్చర్యపోయారు తర్వాత అసలు విషయం తెలిసి తమను ఆటపట్టించిన ప్రియాంకపై చిరుబురులాడుతున్నారు.