నటి శోభన పక్కన వున్న చంద్రముఖి ప్రేమికుడు ఇపుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

నటి శోభన గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. ఆమె చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపోట్టొచ్చు. కానీ ఆమె ఇప్పటికీ సినీ ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వుంది అంటే అది ఆమె గొప్పతనం అని చెప్పుకోవాలి. దక్షిణాది సిని పరిశ్రమలో అప్పట్లో శోభన హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది. శోభన పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె చక్కటి రూపం. సంప్రదాయం ఉట్టిపడే ఆమె వస్త్రధారణ అంటే మన ఆడోళ్లకి చాలా ఇష్టం.

ఇకపోతే శోభన కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్సర్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే మరొకవైపు ఎంతో మందికి క్లాసికల్ డాన్స్ ను నేర్పించిన ఘనత కూడా ఆమెది. ప్రస్తుతం కూడా సొంతంగా ఒక నృత్య శిక్షణ కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు. శోభన వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒక పాపను దత్తత తీసుకుని మరీ పెంచుకుంటోంది. అంతేకాకుండా ఈ వయసులో కూడా శోభన ప్రపంచ వ్యాప్తంగా నృత్య ప్రదర్శనలు ఇస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల తన సోదరుడితో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. అందులో శోభనతో పాటు తన సోదరుడు కూడా సంప్రదాయ నృత్యానికి సంబంధించిన కాస్టూమ్స్ ధరించారు. సరిగ్గా చూస్తే అతగాడు ఎవరు అన్న విషయం బోధపడుతుంది. అతనే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా రాణించిన వినీత్. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ, హింది సినిమాలలో కూడా నటించి మెప్పించాడు. 1994 సరిగమలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, అబ్బాస్‏తో కలిసి నటించిన ప్రేమ దేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.