చిరు- బాలయ్య లో బెస్ట్ ఫైటర్ ఎవరో చెప్పేసిన ఫైట్ మాస్టర్స్..!

రాబోయే సంక్రాంతికి దుమ్ము లేచిపోయే సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీకి దిగుతున్నారు. చిరంజీవి- బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా తమ సినిమాలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతి పోటీ మరింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య కూడా ఒకటి. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తుండగా.. బాలయ్య కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.

Makers of 'Veera Simha Reddy', 'Waltair Veerayya' facing issues? - Telugu  News - IndiaGlitz.com

ఇక ఈ రెండు సినిమాలు కూడా ఒక్క రోజు వ్యవధిలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఇక దీంతో ఈ రెండు సినిమాల‌ మధ్య గట్టి పోటీ నెలకుంది. బాలయ్య వీర సింహారెడ్డి జనవరి 12న, చిరు వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్‌లో సందడి చేయబోతున్నాయి. ఈ సినిమాలలో మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో అందాల భామ శృతిహాసన్ రొమాన్స్ చేయబోతుంది.

ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి అభిమానులు కూడా ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇద్దరు హీరోలు ఈ సినిమా సెట్స్ లో ఎలా తలపడ్డారు..? అనే విషయం గురించి ఈ సినిమాల‌ ఫైట్ మాస్టర్స్‌ రామ్- లక్ష్మణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ రెండు సినిమాలలో ఫైట్స్ ని కూడా ఈ ఇద్దరు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేశారు.

 Ram-lakshman Talks About Veera Simha Reddy And Waltair Veerayya, Ram-lakshman, V-TeluguStop.com

ఈ రెండు సినిమాలు కూడా వేటికవే ప్రత్యేకమని అందుకే ఈ రెండు సినిమాలు మాకు ఓ పెద్ద సవాల్ గా అనిపించాయి. ఈ సినిమాల‌లో యాక్షన్ విషయంలో కూడా ఎన్నో కొత్త విషయాలను తీసుకొచ్చాం.. థియేటర్లో బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సన్నివేశాలు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవ్వాల్సిందే. చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్ లో వచ్చే ఫైట్ ఎంతో కొత్తగా ఉంటుంది. ఇక వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య కుర్చీలో కూర్చుని విలన్స్ ను కొట్టడం మాములుగా ఉండదట.. టర్కీలో చేసిన మాస్ సీక్వెన్స్ అదిరిపోతోంది . ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోష‌ల్ మిడియాలో వైరల్ అవుతున్నాయి.