త్రిష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. నాలుగు పదుల వయసులోను తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన `పొన్నియన్ సెల్వన్` సినిమాతో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మణిశర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులు మెప్పించింది.
ఈ మూవీ అనంతరం త్రిష కు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. స్టార్ హీరోయిన్ తో జతకట్టే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దళపతితో ఓ సినిమా, అజిత్ కుమార్ తో ఓ సినిమా చేసేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ కథలను సైతం ఒప్పుకుందని అంటున్నారు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ `రాంగీ` మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

శుక్రవారం విడుదలైన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పొన్నియిన్ సెల్వన్ సినిమా పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చిందని.. తనను ఇప్పటికీ యువరాణి కుందవైగానే ప్రేక్షకులు చూస్తున్నారని త్రిష ఆనందాన్ని వ్యక్తం చేసింది. డైరెక్టర్ మణిరత్నం, గౌతమ్ మీనన్, శరవణన్, ప్రేమ్ వంటి దర్శకులతో పనిచేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. అలాగే తనకు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జోడీగా పూర్తిస్థాయి పాత్రలో నటించాలని ఉందంటూ మన చిరకాల కోరికను బయట పెట్టింది. మరి త్రిష కోరిక నెరవేరుతుందా..లేదా.. అన్నది చూడాలి.