విడాకులకు సిద్ధమైన స్టార్ హీరో..కీర్తి సురేషే కారణమా..?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సమయంలోనే గత సంవత్సరం చివరలో విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నామని..త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ వార్తలకి బలం చేకూర్చేలా విజయ్ అటెండ్ అవుతున్న ఈవెంట్స్‌లో అతని భార్య సంగీత ఎక్కడ కనిపించడం లేదు. 22 ఏళ్ల వీరి వైవాహిక బంధానికి తెగదెంపలు చేసుకుంటున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు విజయ్ విడాకులు తీసుకోవడానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కారణమంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో విజయ్, కీర్తి కలిసి ఏజెంట్ బైరవ, సర్కార్ వంటి సినిమాల్లో నటించారు.

ఆ సినిమాల షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడింది. ఆబంధమే వీరి మధ్య ప్రేమగా మారిందని, విజయ్ భార్య సంగీత ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ అడిగిన దళపతి చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ కీర్తితో క్లోజ్ గా ఉంటున్నాడని తమిళ మీడియాలో ఎన్నో రకాల వార్తలు కూడా వచ్చాయి. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు ఈ క్రమంలోనే విజయ భార్య సంగీత పేరు మీద #justice for Sangeeta.. అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఇష్యుపై ఇప్పటివరకు విజయ్ కానీ, సంగీత కానీ, కీర్తి సురేష్ కానీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. విజయ్ కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోవటంతో కొందరు ఓర్వలేక ఇలాంటివి తెరపైకి తీసుకు వస్తున్నారని, కావాలనే వారు కీర్తి సురేష్ ని ఇందులోకి లాగుతున్నారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై విజయ్ స్వయంగా స్పందిస్తే కానీ ఈ విషయం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.