మేము అది చూపించకపోతే మీకు నిద్ర పట్టదు.. బాలీవుడ్ హాట్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌కు అసలు కలిసి రావటం లేదు. ఎలాంటి సినిమా చేసిన అది ప్లాప్ లిస్టులో చేరిపోతుంది. ఇక దానికి తోడు గత కొంతకాలంగా బాలీవుడ్‌ను బాయ్ కాట్ ట్రెండ్ పట్టిపీడిస్తుంది. బాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా దానిని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాటిని ట్రెండ్ చేస్తూ ఆ సినిమాకి నెగటివ్ ప్రచారం చేసేవారు. ఇక ఇప్పుడూ దీనిపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ స్పందించింది.

అయితే ఇప్పుడు ఈ విషయంపై తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ బాలీవుడ్ అగ్ర నటి. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘బాయ్ కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమకు మంచిది కాదు.. ఈ విషయంపై తాను అసలు ఏకీభవించెను.. బాయ్‌కాట్ ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే ప్రేక్షకులు చాలా వినోదాన్ని నష్టపోతారన్నారు కరీనాకపూర్’. ‘ఇవన్నీ మీరు పట్టించుకోకుండా ఇలానే చేస్తే తాము మిమ్మల్ని ఎలా ఎంటర్టయిన్ చేయగలమని ప్రశ్నించింది’.

Kareena Kapoor Khan Is Sizzling HOT In The Latest Edition Of Vogue Magazine - Bollywood Hungama

‘సినిమాలు లేకపోతే మీకు వినోదం ఎక్కడి నుంచి వస్తుందని సూటిగా వారినే ప్రశ్నించింది కరీనా. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాపై కూడా ఈ వివాదమే నడుస్తుంది’. దీపికా పదుకునే హీరోయిన్గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ క్రమంలోనే కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది. గత సంవత్సరం కరీనా- అమీర్ ఖాన్ జోడిగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా విడుదలకు ముందు కూడా ఇలానే బాయ్‌కాట్ దెబ్బకు డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది’.

దాంతో బాలీవుడ్ హీరోలు అందరూ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుని కూర్చున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ పఠాన్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో దీపికా కాషాయం రంగు బికినీ వేసుకుని.. బేషరమ్ అనే ఓ స్పైసీ పాటలో నటించడంతో.. వివాదం చెలరేగింది. అది అలానే నడుస్తోంది. దాంతో ఈ సినిమాను కూడా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.