హీరో శర్వానంద్ చేయబోయే లాస్ట్ సినిమా అదే..ఆ తరువాత ఏం చేస్తాడో తెలుసా..?

టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న స్టార్ హీరోలు ఉన్న శర్వానంద్ సినిమా అంటే మాత్రం ఫ్యామిలీ లేడీస్ ఎగబడి చూస్తారు . అంతలా తన సినిమాలో హెల్తీ కామెడీ పంచెస్ వేస్తూ వాడుకుంటూ జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు శర్వానంద్ నటించిన సినిమాలు చూస్తే తన సినిమాల్లో ఎక్కడ వల్గారిటీ, కాంట్రవర్షియల్ కంటెంట్ టచ్ చేయలేదు.

తన సినిమాకి వచ్చిన జనాలను .. రెండున్నర గంట సేపు నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా తీస్తాడు సినిమాలు . కాగా రీసెంట్ గా శర్వా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు అంటూ శర్వానంద్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి సమాచారం అందుతుంది . అయితే శర్వానంద్ మాత్రం ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం పక్క అంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్.

ఆయన బ్యాచిలర్ గా లాస్ట్ చేసే సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దే అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమా నే ఆయన బ్యాచిలర్ గా చేస్తున్న లాస్ట్ సినిమా అని .. ఆ తర్వాత శర్వానంద్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెన్ గా సినిమాలు చేస్తాడని జనాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే శర్వానంద్ తాను కాబోయే భార్య ఎవరో డిసైడ్ చేసుకున్నాడని.. మంచి టైం చూసి ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్తాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి శర్వా ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుతాడో..?