హైపర్ ఆది జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమెనా..?

బుల్లితెర కమెడియన్గా హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే పలు చిత్రాలలో నటించే అవకాశం కూడా అందుకుంటున్నారు. హైపర్ ఆది జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలతో పాటు ప్రత్యేకమైన ఈవెంట్లతో కూడా తన మార్క్ చాటుకున్నాడు. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ కోసం కొంతమంది ప్రత్యేకంగా జబర్దస్త్ ను చూసే వాళ్ళు ఉన్నారంటే హైపర్ ఆది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.

Jabardasth Hyper Aadi aka Kota Aadhayya Biography - Tfipost.comఅయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో హైపర్ ఆది కనిపించడం లేదు. దీంతో హైపర్ ఆది పైన అనేక రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి .ఈ క్రమంలో కూడా తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో అది కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రతివారం కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లతో వచ్చి ఆడియన్స్ను అలరిస్తూ ఉంటారు. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు అని కాన్సెప్ట్ తో రాబోతున్న ఒక ప్రోగ్రాం కు సంబంధించి ప్రోమో తెగ వైరల్ గా మారుతోంది.

రాకెట్ రాఘవ డాన్స్ అయితే ఒక రేంజ్ లో ఉందని అలాగే బుల్లెట్ భాస్కర్ హైపర్ ఆది పెదరాయుడు గెటప్రో చేసిన స్కిట్లు ప్రతి ఒక్కరిని నవ్విస్తున్నది. ఈ క్రమంలో రష్మీ హైపర్ ఆది కొన్ని ప్రశ్నలు అడిగింది వాటికి సమాధానం తెలియచేస్తూ తెలిపారు హైపర్ ఆది. ఇదే సమయంలో జబర్దస్త్ మానేయడానికి ఈ ముగ్గురిలో ఎవరు కారణమంటూ యాంకర్ సౌమ్యరావుతో పాటు మరో ఇద్దరు ఫోటోలను రశ్మి స్క్రీన్ పైన చూపించింది. దీంతో సౌమ్యరావుని చూపిస్తూ నేను జబర్దస్త్ మానియడానికి కారణం ఆమె అంటూ తెలియజేశారు.