వాల్తేరు వీరయ్య సినిమా అభిమానులను మెప్పించిందా..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది. చిరంజీవి సరైన సక్సెస్ అందుకోలేక ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతోంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.ముఖ్యంగా ఈ సంక్రాంతికి బాలయ్య చిరంజీవి పోటీ పడుతున్నారు అనే విషయం అభిమానులలో మరింత ఆసక్తిని రేపుతోంది.. నిన్నటి రోజున వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈరోజున వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్ లో విడుదల అయింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా భారీ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ కూడా మొదట ఏంటి అనే విషయం బయటికి రావడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం.

Mega 154: Chiranjeevi And Bobby's Upcoming Movie Is Titled 'Waltair Veerayya '…

వాల్తేరు వీరయ్య చిత్రంలో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకున్నారో అలా డైరెక్టర్ బాబి చూపించారని తెలుస్తోంది. అలాగే కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకొని సాగిపోయి సినిమా కథ అన్నట్లుగా సమాచారం. ఫ్రీ ఇంటర్వెల్ వరకు ఆసక్తిగానే సాగిందని.. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో పూనకాలు తెప్పించే విధంగా ఉంటోందని నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు. ఇక సెకండాఫ్ పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయని ఇక సెకండాఫ్ లో రవితేజ ఎంట్రీ తర్వాత చిరంజీవి రవితేజల మధ్య వచ్చే సీను ప్రతి ఒక్కరిని ఆసక్తి కలిగించేలా కనిపిస్తోందని తెలుస్తోంది.

ఫ్రీ క్లైమాక్స్ కొంచెం రొటీన్ గా సాగినప్పటికీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ప్రతి ఒక్కరిని ఆసక్తి కలిగిస్తుందని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి మాస్ యాక్షన్ డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా కథ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల స్లోగా అవ్వడం లాంటిది అయినప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.