NTR -30 సినిమాకి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. తన విభిన్నమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపుగా గత ఏడాది ప్రకటించడం జరిగింది.అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం 2024 ఏప్రిల్ 17న ప్రకటించినట్లు తెలుస్తోంది.

Release date sealed for NTR 30 ..? - Filmify.in

ఇక ఎన్టీఆర్ కు జోడిగా ఇందులో జాన్వి కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ కెరియర్ ఒక్కసారిగా కష్టాలలోకి పడిపోయిందని చెప్పవచ్చు. అలా ఎన్టీఆర్ తో సినిమా చేయడంపై ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం కేవలం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే నెల మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ .70 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా తో కొరటాల శివ తన స్టార్డమ్మని నిలబెట్టుకునేలా ఉండబోతోంది అని తెలుస్తోంది. తారక్ కూడా ఈ సినిమాలో కాస్త విభిన్నంగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా కథల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నది. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఎన్టీఆర్.