`హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు హైప‌ర్‌ ఆది సాయం.. ఇక ద‌శ తిర‌గ‌డం ఖాయం!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు.

పీరియాడిక్‌ యాక్షన్ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లి చాలా కాల‌మే అయింది. పలు కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే ఈ సినిమాలో `జబర్దస్త్` ద్వారా పాపుల‌ర్ అయిన హైప‌ర్ ఆది కూడా భాగం అయ్యాడ‌ట‌. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు హైప‌ర్‌ ఆది రాత సాయం చేస్తున్నాడ‌ట‌.

ఆది ఓవైపు కమెడియన్‌గా స‌త్తా చాటుతూనే, ఇంకో వైపు కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ పరంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇటీవ‌ల ధ‌మాకాకు సైతం ఆది కామెడీ స్కిట్ లు రాయడం జ‌రిగింది. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాకి సంబంధించి కొన్ని కామెడీ సీన్ల విషయమై స్క్రిప్టు సాయం చేస్తున్నాడట హైపర్ ఆది. రైటర్ సాయి మాధవ్ బుర్రాతో కలిసి హైపర్ ఆది పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆది ప‌ని త‌నానికి మంచి మార్కులు ప‌డితే.. అత‌డి ద‌శ తిర‌గ‌డం ఖాయ‌మ‌వుతుంది. మ‌రి కొన్ని సినిమాల నుంచి కూడా ఆదికి ఆఫ‌ర్లు వ‌స్తాయి.