డీప్ నెక్ లో డెప్త్‌గా అందాలు ఆర‌బోసిన సోనాల్‌.. వింట‌ర్‌లోనూ వేడి పుట్టించిందిగా!

సోనాల్ చౌహాన్.. ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లెజెండ్, పండగ చేస్కో, సైజ్ జీరో వంటి చిత్రాలతో సోనాల్‌ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.

ఇక్కడ అడపా త‌డ‌పా సినిమాలు చేసింది. కానీ అవేమి సోనాల్ కెరీర్ కు ఉపయోగపడలేదు. రీసెంట్ గా సోనాల్ `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. అక్కినేని మన్మధుడు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ మూవీ ఇది.

దసరా కానుక విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సోనాల్ కు నిరాశే ఎదురయింది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో సోనాల్‌ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ కుర్ర‌కారకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది.

తాజాగా స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్ లో డెప్త్ గా అందాలు ఆర‌బోస్తూ సూపర్ హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. మత్తుగా గమ్మత్తుగా చూస్తూ వింటర్ లో వేడి పుట్టించింది. సోనాల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి.