అరుదైన గౌరవం పొందుతున్న ఎన్టీఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ నటుడు గానే కాకుండా రాజకీయ వేత్తగా కూడా మంచి పేరు సంపాదించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ నేపథ్యంలోనే అమెరికాలో న్యూ జెర్సీలో ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అక్కడి మేయర్ అంగీకారం తెలియజేసినట్లు సమాచారం. అన్నగారి శత జయంతి వేడుకలు సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించేందుకు అక్కడ ప్రతిపాదనలపై సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చొరవ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

File:NT Rama Rao statue at NTR Circle, Anantapur.jpg - Wikimedia Commonsతెలుగు వారు ఎక్కువగా అమెరికాలో ఎంట్రీ ఇవ్వగానే మొదట ఎడిసన్ సిటీ నుంచి ప్రారంభిస్తారని దీనికి దగ్గరలోని న్యూయార్క్ నగరం లో కూడా చాలా మంది తెలుగువారు పనిచేస్తున్నారని సమాచారం. ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనను సమీక్షించిన తరువాతే వెంటనే ఆమోదం తెలిపారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అవసరమైన స్థలాన్ని కూడా పర్యావేక్షిస్తున్నట్లుగా సామ్ జోష్ అధికారులను ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సాకేత చదలవాడ, ఉజ్వల్ కుమార్ కస్తాలాలు స్థలాన్ని అన్వేషించేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది అని అనుకున్నట్లు జరిగితే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో బహిరంగ ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే కావడమని చెప్పవచ్చు. ఇది భారతీయులకు తెలుగు ప్రజల గర్వకారణంగా ఈ విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అందుకు సంబంధించి నిధులను కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం.

Telugu Producer TG Vishwa Prasad Behind First NTR Statue Outside Indiaఈ సంస్థతోపాటు ఎడిసన్ అమెరికా వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు తెలుగు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవడానికి తెలుగు సినిమా వైభవాన్ని చాటి చెప్పడంలో ఇది ఒక మెట్టు అని టీజీ విశ్వప్రసాద్ తెలియజేశారు