కొడుకు సినిమా కోసం ఆ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దించిన సురేష్ బాబు..!

దగ్గుబాటి హీరో రానా గత కొంతకాలంగా వెండితెరపై కనిపించడం లేదు. బాహుబలి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ దగ్గుపాటి హీరో ఆ తర్వాత మాత్రం తన సినిమాలలో స్పీడు తగ్గించేసార‌ని చెప్పాలి. అయితే ఈ సంవత్సరం మళ్లీ వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా వాటిలో ఒక్క సినిమాతోనే ఆకట్టుకోగలిగాడు.

Rana Daggubati launches a grooming brand for men with face, beard and  skincare categories. We find o

ఈ సినిమాలు కన్నా ముందు రానా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తో `హిరణ్యకశిప` అనే సినిమా కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికార ప్రకటన బయటకు వచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

Suresh Babu clears air on Rana's engagement news - TeluguBulletin.com

ఈ సినిమాను నిర్మిస్తున్న సురేష్ బాబు `హిరణ్యకశిప` సినిమా నుండి గుణిశేఖర్ తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. అంతేకాకుండా ఈ సినిమాను టాలీవుడ్ లో ఉన్నా ఓ అగ్ర దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడని.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Trivikram movie with Rana in Gunashekar's Title

ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి ఇంకా అధికార ప్రకటన మాత్రం బయటకు రాలేదు. సురేష్ బాబు ఈ సినిమాను మైథాలాజికల్ సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న ఈ సినిమాకు అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్‌ గా ఈ సినిమా విడుదల కాబోతుందని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు.