టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. అయితే పర్సనల్ లైఫ్‌తో పాటు సినిమాల్లో సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్‌సేన్‌గా మార్చుకున్నాడు. కానీ ఈ పేరు కూడా అతడికి కలిసి రాలినట్లుంది. ఎందుకంటే రీసెంట్‌గా అతడు టాలీవుడ్‌లో డిజాస్టర్లను వరుసగా చవిచూస్తున్నాడు. వాస్తవానికి ఈ యంగ్ హీరో తన ప్రతిభతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసిన కొంతకాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి చాలా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడే అతన్ని దురదృష్టం వెంటాడుతోందని తెలుస్తోంది.
2021లో వచ్చిన పాగల్ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది మాత్రమే కాదు 2022లో రిలీజ్ అయిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా కమర్షియల్‌గా ఫెయిల్ అయింది. మొదట ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు బాగా తగ్గి పెట్టిన బడ్జెట్ తిరిగి వసూలు చేయడం కష్టమైపోయింది. తర్వాత అతను చేసిన ఓరి దేవుడా అనే ఫాంటసీ రొమాంటిక్ ఫిలిం కూడా బాక్సాఫీస్ వద్ద ఎదురు తన్నింది.
నిజానికి ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ నటించాడు కానీ ఈ సినిమా వైపు చూసే ప్రేక్షకుడే కరువయ్యాడు. దాంతో విశ్వక్ సేన్ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తర్వాత వచ్చిన ముఖచిత్రం సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దాంతో వరుసగా ఫ్లాప్స్ ఎదురవుతున్న వేళ విశ్వక్‌సేన్ కెరీర్ ముందుకు సాగడం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే అతనికి హిట్స్ రాకపోవడానికి కారణం చాలానే ఉన్నాయి. మొదటగా అతడు సరైన రిలీజ్ డేట్లను ఎంచుకోవడం ఒక కారణమని చెప్పొచ్చు. అలానే వరుసగా వివాదాల్లో ఉండటం కూడా అతనిపై కాస్త నెగెటివిటీ పెంచుతుంది. దీనివల్ల అతని సినిమాలను ఆదరించేందుకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.
అలానే ఈ హీరో వేగంగా సినిమాల్లో నటిస్తున్నాడు, సినిమాకు ప్రమోషన్స్ చేసే విషయంలో పొరపాట్లు చేస్తున్నాడు. అలాగే కథలో ఎన్నికల విషయంలో కూడా సరైన జాగ్రత్త తీసుకోవడం లేదని తెలుస్తోంది వీటన్నిటిని సరిదిద్దుకుంటేనే అతడి యాక్టింగ్ లైఫ్‌కి మనుగడ ఉంటుంది లేదంటే అన్ని సర్దుకొని ఇంటికి వెళ్లి పోవాల్సిన పరిస్థితి వస్తుంది.