ప్రముఖ నటి శృతి హాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న శృతి కాస్త గ్యాప్ తీసుకుంది. గత ఏడాది రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటించి అందరినీ అలరించింది. దాని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ మెరిసిందీ భామ. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన ‘సలార్’, బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి సరసన బాబీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొన్నటివరకు బ్రేక్ తీసుకున్న శృతి హాసన్ ఇపుడిప్పుడే వరుస సినిమాలలో యాక్ట్ చేస్తోంది. గత ఏడాది శృతి నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఆమె మళ్ళీ సినిమాలు తీయడానికి ముందుకు వచ్చింది.
సినిమా వరకు బానే ఉంది కానీ ఈ అమ్మడు ఇప్పుడు శాంతను హజారికాతో పీకలోతు ప్రేమలో మునిగిపోయింది. గత కొంతకాలంగా వీరిద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శృతి తన ప్రియుడితో దిగిన ఫొటోలని అభిమానులతో పంచుకుంది. కరోనా సమయంలో కూడా వీరిద్దరూ కలిసే ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో సెపరేట్‌గా ఒక ఫ్లాట్ తీసుకొని అందులో ఉంటున్న విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. కానీ తాజాగా శృతి హాసన్ తన లవ్ బ్రేకప్ అయింది అనే విషయాన్ని హింట్ ఇస్తోంది.
‘నాలా నేను.. నాతో నేను..ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేను సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను అనేదాని గురించి నేను రియాలైజ్ అయ్యాను’ అంటూ శృతి ఒక పోస్ట్ పెట్టింది. అది చూశాక శృతి, శాంతను మధ్య ఏం ఏదైనా జరిగి ఉండొచ్చుగా అందుకనే శృతి ఇలా మాట్లాడుతూ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా శృతి తన బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పడిందేమో, తన లవ్‌కి బ్రేకప్ చెప్పిందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.