సాధారణంగా సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. వారు పెళ్లి చేసుకుంటే అది వారి కెరియర్ కి భారంగా మారుతుందని భయంతో .. పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే వారి వయసు మీద పడుతున్నప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి మాత్రం తొందర పడతారు అనుకుంటే అది కూడా జరగడం లేదు. కానీ గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరికొందరు ఎంగేజ్మెంట్ చేసుకొని కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అలియా భట్ – రణ్ బీర్ కపూర్ : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్ 2014 నుంచి ప్రేమలో ఉన్నారు. వీరు మధ్యలో కొన్ని రోజులు డేటింగ్ కూడా చేసి ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు.
నయనతార – విగ్నేష్ శివన్ : సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ స్టార్ట్ దర్శకుడు విగ్నేష్ శివన్ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ సంవత్సరం జూన్ నెలలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. రీసెంట్‌గా వీరు సరోగసి పద్ధతిలో ఇద్దరు కమల పిల్లలకు కూడా జన్మనిచ్చారు.
హన్సిక : టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ హన్సిక తన చిన్ననాటి స్నేహితుడైన బిజినెస్ పార్ట్నర్ అయిన సోహెల్ కతూరియాతో ఈ నెల4న ఘనంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.
గౌతమ్ కార్తీక్ – మంజిమా మోహన్ : మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో హీరోగా పరిచయమైన కార్తీక్ మరియు మంజీమా మోహన్.. 2019లో వచ్చిన ‘దేవరట్టం’ అనే సినిమాలు ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ సంవత్సరం నవంబర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు.
నాగ శౌర్య : టాలీవుడ్ హీరో నాగశౌర్య కూడా ఈ సంవత్సరం నవంబర్ 19న ఘనంగా అనూష శెట్టి అనే ఫ్యాషన్ డిజైనర్ ని లవ్ చేసి వివాహం చేసుకున్నాడు.
వశిష్ఠ సింహ – హరి ప్రియా : నాని హీరోగా వచ్చిన పిల్ల జమీందార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హరిప్రియ, కేజిఎఫ్ సినిమాతో పాపులర్ అయిన వశిష్ఠ సింహ గత కొద్దిరోజులుగా లవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
మౌనీ రాయ్ : ‘బ్రహ్మాస్త్రం’ లో విలన్ గా చేసి పాపులర్ అయిన మౌనీ రాయ్… సూరజ్ నంబియార్ ను ఈ సంవత్సరం జనవరిలో పెళ్లి చేసుకుంది.
పూర్ణ : టాలీవుడ్ హీరోయిన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పూర్ణ కూడా షానిద్ అసిఫ్ అలీ అనే దుబాయ్ బెస్ట్ బిజినెస్‌మాన్‌ను ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంది.
డి.ఇమ్మాన్ : కోలివుడ్‌లో విశ్వాసం, పెద్దన్న సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున ఇమ్మాన్.. ఈ సంవత్సరం మే నెలలో అమేలీని రెండో వివాహం చేసుకున్నాడు.
రవి చంద్రశేఖరన్ – మహాలక్ష్మీ : కోలీవుడ్ లో ఎంతో హాట్ టాపిక్ గా మారినా నిర్మాత రవి చంద్రశేఖరన్ నటి మహాలక్ష్మి ఇద్దరూ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని విడిపోయి.. మళ్లీ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ సంవత్సరం వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
హరీష్ కళ్యాణ్ : నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో నానికి కొడుకుగా నటించిన హరీష్ కళ్యాణ్ ఈ సంవత్సరం నర్మదా ఉదయ్ కుమారును పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు.
ఆది పినిశెట్టి – నిక్కీ గల్రాని : టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రవిరాజా పిలిశెట్టి కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన ఆది పిలిశెట్టి ఈ సంవత్సరం మరో హీరోయిన్ అయినా నిక్కీ గల్రాని వివాహం చేసుకొని ఒకటి అయ్యారు.